husband attack on wife: ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భార్యను.. కత్తితో పొడిచేశాడు! - ap latest news
![husband attack on wife: ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భార్యను.. కత్తితో పొడిచేశాడు! husband attack on wife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14109201-496-14109201-1641445567215.jpg)
09:51 January 06
చిలకలూరిపేటలో భార్యపై భర్త దాడి
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యపై భర్త దాడి చేశాడు. భార్యపై అనుమానంతో కత్తితో పొడిచాడు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన నాగరాణి, యెహోను భార్యాభర్తలు.
అనారోగ్యం కారణంగా.. చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది నాగరాణి. అయితే.. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త యెహోను.. ఆసుపత్రిలోనే ఆమెపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం నాగరాణి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: