గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం చినకంచర్ల గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యను తీవ్రంగా గాయపరిచాడు. గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస అయిన నాగేశ్వరరావు.. భార్య సువార్త తీరుపై అనుమానం వ్యక్తం చేసేవాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు. ఇద్దరి మధ్య తరుచూ గొడవ జరిగేదని తెలిపారు.
ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న అతను ఇనుప కడ్డీతో ఆమె తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన సువార్తను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కొంత విషమంగానే ఉందని బంధువులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై దాసరి శివ నాగరాజు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.