కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్య - husband and wife suicide in guntur district
నిండు నూరేళ్లు జీవించాల్సిన వారి జీవితాలు చిన్నపాటి కలహాలతో అర్ధాంతరంగా తనువులు చాలించారు. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో చిన్నారులు... తల్లిదండ్రులను కోల్పోయారు. ఈ విషాదం గుంటూరు జిల్లాలో జరిగింది.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు హత్మహత్య చేసుకున్నారు. నాలుగు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట భార్య రేవతి పురుగు మందు తాగింది... ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.... చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం భర్త బత్తుల ఏసుబాబు ఉరివేసుకున్నాడు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. చిన్నపాటి గొడవలతో క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాలకు చిన్నారులు దిక్కులేని వారిగా మారారు. వార పరిస్థితిని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి-"పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు యత్నించా"
TAGGED:
wife and husband suicide