ఇదీ చూడండి:
58 గంటల నిరాహారదీక్ష విరమింపజేసిన దేవినేని - latest news of state capital issue
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాయపూడికి చెందిన 61ఏళ్ల మామిళ్లపల్లి నరేంద్రబాబు 100 గంటల నిరాహార దీక్షకు దిగారు. మంచినీళ్లు సైతం తాగకుండా 58 గంటల దీక్ష చేశాక.. ఆరోగ్యం క్షీణించడంపై ఆయన కుమార్తె, బంధువులు ఆందోళన చెందారు. రక్తపోటు, మధుమేహం అదుపు తప్పగా.. నరేంద్రబాబుకు మాజీ మంత్రి దేవినేని ఉమ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. చికిత్స నిమిత్తం గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించారు. కోలుకున్నాక మళ్లీ నిరసనలో పాల్గొంటామని.. నరేంద్రబాబు, అతని కుమార్తె శివజ్యోతి చెప్పారు.
రాజధాని అమరావతికోసం నిరాహారదీక్ష చేసిన రైతు