జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యుల బృందం రెండోరోజు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పర్యటించింది. పార్టీ కక్షలతో తమ శ్రేణులపై వైకాపా వర్గాలు దాడులు చేస్తున్నాయంటూ... తెదేపా ఎంపీలు, నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కమిషన్ బృందం పర్యటించింది. పొనుగుపాడు గ్రామంలో ఇరువర్గాల నుంచి వేర్వేరుగా వాంగ్మూలం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు, ఫలితాలు వెలువడిన తర్వాత గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఆరాతీశారు. రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
రెండోరోజు మానవహక్కుల కమిషన్ సభ్యుల పర్యటన - latest news of guntur district about party clashes
జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యుల బృందం రెండోరోజు గుంటూరు జిల్లాలో పర్యటించింది. పార్టీ కక్షలతో పెరుగుతున్న దాడులపై విచారణ చేసింది.
![రెండోరోజు మానవహక్కుల కమిషన్ సభ్యుల పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4913457-447-4913457-1572456649592.jpg)
గుంటూరులో మానవహక్కుల కమీషన్ పర్యటన