ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల దాడులు... భారీగా మద్యం, గుట్కా పట్టివేత - గుంటూరు జిల్లాలో మద్యం పట్టివేత

రాష్ట్రంలో మద్యం, గుట్కా, గంజాయి అక్రమ రవాణా జోరందుకుంటోంది. వివిధ ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా మద్యం, గుట్కా పట్టుబడింది. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

huge wine, gutka seize at various places in andhra pradhesh
పోలీసులు పట్టుకున్న మద్యం సీసాలు

By

Published : Sep 10, 2020, 11:12 PM IST

అనంతపురం జిల్లాలో....

అనంతపురం జిల్లా ఉరవకొండలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని నుంచి 288 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, రిమాండ్​కు తరలించారు.

కృష్ణా జిల్లాలో...

నూజివీడు సిలువుగట్టు వద్ద.. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం, గుట్కాను తరలిస్తున్న రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుని నుంచి రూ.50 వేలు విలువైన మద్యం, గుట్కా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ..

కొత్తపేటలో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్టు చేశారు. అతని నుంచి 16 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

కడప జిల్లాలో...

వేంపల్లి మండలంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి మద్యం బాటిళ్లు, నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ హెచ్చరించారు.

గుంటూరు జిల్లాలో...

వినుకొండలో తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ నుంచి తరలిస్తున్న 34 కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. కర్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని దండుబాట రోడ్డులో పోలీసులు దాడులు నిర్వహిస్తుండగా... 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.

ప్రకాశం జిల్లాలో...

మద్దిపాడు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా మద్యం పట్టుపడింది. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మద్యం, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని చీరాల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

తితిదే ఆదాయ వ్యయాలపై కాగ్‌ ఆడిటింగ్ సాధ్యమయ్యేనా..?

ABOUT THE AUTHOR

...view details