భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ Huge Increase in Electricity Demand: రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ జులై మొదటి వారంలోనూ తగ్గడం లేదు. శనివారం కూడా విద్యుత్తు వినియోగం 240.10 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. వేసవిలో మాదిరే విద్యుత్తు డిమాండ్ ఉంటోంది. గతంలో ఉన్న పరిస్థితికి భిన్నంగా విద్యుత్తు వినియోగం లెక్కలు నమోదవుతున్నాయి. గత రెండేళ్లలో జూన్ రెండో వారం నుంచే డిమాండ్ క్రమేణా తగ్గుతూ 200 మిలియన్ యూనిట్లల లోపు ఉండేది. ఈ ఏడాది అందుకు భిన్నంగా జూన్ మూడో వారం నుంచి డిమాండ్ మళ్లీ పెరుగుతోంది.
Minister Peddireddy కోతల్లేకుండా విద్యుత్ సరఫరా.. త్వరలో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన
దీంతో జూన్ వరకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనుగోలు చేసి తంటాలుపడి సర్దుబాటు చేసిన డిస్కంలు.. జులై వచ్చినా విద్యుత్తు కొనుగోలుకు పరుగులు పెట్టక తప్పడం లేదు. పవన విద్యుత్తు 54.95 మిలియన్ యూనిట్లు, సౌర విద్యుత్తు 13.82 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు అందడంతో డిస్కంలకు కొంత ఊరట లభించింది. అయినా డిమాండ్ సర్దుబాటుకు డే అహెడ్ మార్కెట్‌లో 13 మిలియన్ యూనిట్లు, రియల్‌టైం మార్కెట్‌లో 15.46 మిలియన్ యూనిట్లు కలిపి మొత్తం 28.46 మిలియన్ యూనిట్ల విద్యుత్తును డిస్కంలు శనివారం కొన్నాయి.
విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం అది కాదు : ట్రాన్స్‌కో ఎండీ
జూన్ రెండో వారంలో 263 మిలియన్ యూనిట్ల గరిష్ఠ డిమాండ్ నుంచి క్రమేణా తగ్గుతూ జూన్ 25 నాటికి వినియోగం 197.38 మిలియన్ యూనిట్లకు చేరింది. వినియోగం తగ్గడంతో రోజూ 35 కోట్ల నుంచి 40 కోట్లు రూపాయల ఖర్చు చేసి బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొంటున్న డిస్కంలపై ఒత్తిడి తగ్గింది. దీంతో మిగులు విద్యుత్తును కొద్ది రోజుల పాటు డిస్కంలు మార్కెట్‌లో విక్రయించాయి. ఉష్ణోగ్రతలు మళ్లీ భారీగా పెరగడంతో విద్యుత్తు వినియోగం మళ్లీ ఎక్కువైంది. గత వారం వ్యవధిలో డిమాండ్ 42.72 మిలియన్ యూనిట్లు పెరిగింది. దీనికి అనుగుణంగా వేసవిలో మాదిరే జులైలోనూ రోజుకు 28 మిలియన్ యూనిట్ల విద్యుత్తును డిస్కంలు మార్కెట్‌లో కొనాల్సి వస్తోంది.
Huge increase in electricity demand: ఎడాపెడా విద్యుత్ కోతలు.. ప్రభుత్వ వైఫల్యమే: పయ్యావుల
ఈ ఏడాది జులై 1న రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ 240.10 మిలియన్ యూనిట్లుగా ఉంటే.. గతేడాది ఇదే సమయంలో 193.13 మిలియన్ యూనిట్లుగా ఉంది. అంటే 47 మిలియన్ యూనిట్ల వినియోగం అధికమైంది. ఇంతగా డిమాండ్ పెరుగుతుందన్న విషయం రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ అంచనాలకు కూడా అందలేదు. జూన్ మూడో వారం నుంచి డిమాండ్ తగ్గుతుందని సాంకేతికత ఆధారంగా అంచనా వేసింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విద్యుత్తుకు డిమాండ్ పెరగడంతో డ్యామ్‌లో యూనిట్ సగటున 3రూపాయల 10పైసల చొప్పున, ఆర్‌టీఎంలో యూనిట్ 4 రూపాయల 60 పైసలు చొప్పున ఖర్చు చేసి డిస్కంలు కొంటున్నాయి.