ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో భారీగా గుట్కా నిల్వలు పట్టివేత.. - guntur crime news

గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీగా గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు రూ.97లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు.

huge gutka seized at at Guntur
గుంటూరులో భారీగా గుట్కా నిల్వలు పట్టివేత

By

Published : Jun 14, 2021, 4:21 PM IST

గుంటూరులో భారీగా గుట్కా నిల్వలు పట్టివేత

గుంటూరు పోలీసులు భారీ గుట్కా రాకెట్​ను ఛేదించారు. గుంటూరు జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు రూ.97లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, రాజస్థాన్ కేంద్రంగా గుట్కా తయారీ జరుగుతోందని.. బెంగళూరుకు చెందిన సిద్ధప్ప అనే వ్యక్తిని కీలక పాత్రధారిగా గుర్తించినట్లుగా గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. రెండు రాష్ట్రాల నుంచి వస్తున్న గుట్కా నిల్వలు.. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలకు సరఫరా అవుతున్నాయని వివరించారు.

కర్ణాటక, రాజస్థాన్​లో రెండు పోలీసు బృందాలు ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్నాయని ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు. కేసును పకడ్బంధీగా చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రశంసించారు. గుట్కా విక్రయాలు, నిల్వలపై ప్రజలు నిర్భయంగా సమాచారం అందించాలని ఎస్పీ విశాల్ గున్నీ కోరారు.

ఇదీ చదవండి: పార్టీ మారలేదనే.. నాపై కక్ష సాధింపులు: పల్లా శ్రీనివాసరావు

ABOUT THE AUTHOR

...view details