ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Huge Gutka Seized: 75 బస్తాల గుట్కా.. కిలో గంజాయి సీజ్ - Huge Gutka Seized : 75 బస్తాల గుట్కా.. కిలో గంజాయి సీజ్

గుంటారు జిల్లాలోని దాచేపల్లి పరిధిలోని చెక్​పోస్ట్ వద్ద గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపులు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

Huge Gutka Seized : 75 బస్తాల గుట్కా.. కిలో గంజాయి సీజ్
Huge Gutka Seized : 75 బస్తాల గుట్కా.. కిలో గంజాయి సీజ్

By

Published : Jun 20, 2021, 10:34 PM IST

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్​పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్న గుట్కాను పట్టుకున్నట్లు గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు.

పక్కా సమాచారం మేరకు..

కర్ణాటక నుంచి నిషేధిత గుట్కా తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు తనిఖీ నిర్వహించామని డీఎస్పీ పేర్కొన్నారు. లారీలో ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేలా లారీ బాడీలో ఒక బాక్స్​ ఏర్పాటు చేసి 75 బస్తాల గుట్కా, కేజీ గంజాయిని అందులో నిల్వ చేశారు. సరకు విలువ సుమారు రూ. 28 లక్షల 12 వేల 500 ఉంటుందని వివరించారు. గుట్కా రవాణా కేసులో నలుగురిపై కేసు నమోదు చేశామని.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

వాటికి అడ్డుకట్ట వేస్తున్నాం..

త్వరలోనే మిగతా ఇద్దరు నిందితులను పట్టుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాలతో అక్రమ గుట్కా, మద్యం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నామన్నారు.

ఎవరికైనా తెలిస్తే చెప్పండి..

అక్రమ రవాణాపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని డీఎస్పీ సూచించారు. సమావేశంలో సీఐ ఉమేష్, ఎస్ఐలు బాల నాగిరెడ్డి, రహమతుల్లా, ఏఎస్​ఐ సుబ్బారెడ్డి, రైటర్ రమేష్, కానిస్టేబుల్​లు వెంకట్ నాయక్, వెంకట్రావు, చారీ, వెంకటేశ్వర్లు ఉన్నారు.

ఇవీ చూడండి : APSRTC : రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details