పులిచింతలకు సాగర్ నుంచి భారీగా వరదనీరు వస్తోంది. అధికారులు.. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి కోసం 10 వేల క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు.
ప్రస్తుతం పులిచింతల ఔట్ ఫ్లో లక్షా 40 వేల క్యూసెక్కులు కాగా ఇన్ఫ్లో 78 వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయంలో ప్రస్తుతం 42.67 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు. వరద ఉద్ధృతి చూసి రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. దిగువప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.