ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో ఆగని కరోనా ఉద్ధృతి... మరణాల్లో రాష్ట్రం లోనే రెండో స్థానం

గుంటూరు జిల్లాలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. ఆదివారం జిల్లాలో 535 కరోనా పాజిటివ్ కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,848కి చేరింది.

huge corona cases registered in guntur district
గుంటూరులో ఆగని ఉద్ధృతి

By

Published : Sep 27, 2020, 10:22 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 535 పాజిటివ్ కేసులు, అయిదు మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 54,848కి చేరింది. వైరస్ నుంచి 46,466 మంది కోలుకున్నారు. జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 519కి ఎగబాకింది. చేరింది. రాష్ట్రంలో అత్యధిక మరణాలు నమోదైన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 86 మందికి కరోనా సోకినట్లు నిర్థరణ అయింది. మండలాల వారీగా చూస్తే... తెనాలిలో 61, నరసరావుపేటలో 42, తాడికొండలో 34, రేపల్లెలో 35, పెదకాకానిలో 23, పొన్నూరులో 23, శావల్యపురంలో 18, సత్తెనపల్లిలో 18, నాదెండ్లలో 21, మంగళగిరిలో 14, బాపట్లలో 13, తాడేపల్లిలో 12, దాచేపల్లిలో 12, చుండూరులో 11, తుళ్లూరులో 10, నకరికల్లులో 10 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details