గుంటూరు జిల్లాను కరోనా వైరస్ గజగజలాడిస్తోంది. జిల్లాలో ఆదివారం కొత్తగా 507 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 32,011కి చేరింది. వైరస్ కారణంగా మరో ముగ్గురు మరణించగా... ఇప్పటివరకు మొత్తం 331 ప్రాణాలు కోల్పోయారు. 23,521 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనాతో గుంటూరు జిల్లా గజగజ... ఒక్కరోజే 507 కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం కొత్తగా 507 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి
కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా గుంటూరు నగరంలోనే 90 ఉన్నాయి. బాపట్లలో 52, మాచర్లలో 49, నాదెండ్లలో 38, మంగళగిరిలో 37, తెనాలిలో 33 , సత్తెనపల్లిలో 27, నరసరావుపేటలో 24, రొంపిచర్లలో 22, కారంపూడిలో 18, దుర్గిలో 13, పొన్నూరులో 11 మందికి పాజిటివ్‌గా తేలిందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.