Huge cash seized: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న వేళ భారీగా నగదు పట్టుబడింది. నియోజకవర్గంలోని నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షలు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఓ కారులో తెరాస శ్రేణులు నగదు తరలిస్తున్నారన్న భాజపా శ్రేణుల ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. రూ.10 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు చండూరులో ఓటర్లకు డబ్బుల పంపిణీకి కొందరు యత్నించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నాయకులు డబ్బులు వదిలి అక్కడి నుంచి పరారయ్యారు.
మునుగోడులో భారీగా నగదు పట్టివేత.. కారులో తరలిస్తుండగా..! - cash seized in chanduru
Huge cash seized: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక జరుగుతండగా ఆ నియోజకవర్గంలో భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో రూ.10 లక్షలు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అసలేం జరిగిందంటే..?
మునుగోడులో భారీగా నగదు పట్టివేత