పోలీసులు ఎన్ని దాడులు చేస్తున్నా తెలంగాణ నుంచి అక్రమ మద్యం రవాణా పెద్దఎత్తున సాగుతూనే ఉంది. తాజాగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం అడ్డరోడ్డు వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టిప్పర్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 30 లక్షల విలువైన 3156 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్ పారిపోయాడు.
రూ.30 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత - గుంటూరు జిల్లా తిమ్మాపురం వద్ద ఎస్ఈబీ పోలీసుల తనిఖీలు
పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని గుంటూరు జిల్లా తిమ్మాపురం వద్ద ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరకు విలువ సుమారు రూ. 30 లక్షల వరకు ఉంటుందని ఎస్ఈబీ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ మద్యం పట్టివేత
ఈ కేసులో తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి రామయ్య, మూర్తి, గురజాల శ్రీనులను ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్ఈబీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూదవండి..ఆనందయ్య ఇచ్చే కరోనా మందు మంచిదా? కాదా?