గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పోందుగుల చెక్ పోస్ట్ వద్ద దాచేపల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా లారీలో తరలిస్తున్న 35 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి లారీని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అధిక సంపాదనే లక్ష్యంగా కొందరు అడ్డదారులలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని.. ఈ తరహా చర్యలను ఉపేక్షించేది లేదని డీఎస్పీ హెచ్చరించారు.
అక్రమంగా తరలిస్తున్న 35 కేసుల మద్యం పట్టివేత - గుంటూరులో భారీ మద్యం స్వాధీనం
అక్రమంగా లారీలో తరలిస్తున్న 35 కేసుల మద్యాన్ని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పోందుగుల చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన సోదాల్లో గుర్తించినట్లు గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న 35 కేసుల మద్యం పట్టివేత