ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదల సొంతింటి కల నెరవేర్చడానికి సీఎం జగన్ మహాయజ్ఞం' - 1,466 మందికి నాదెండ్ల, గణపవరంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఎమ్మెల్యే రజిని

దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా.. ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తున్నట్లు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని తెలిపారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండల కేంద్రంతో పాటు గణపవరంలో.. 1,466 మందికి ఇళ్ల పట్టాలను అమె పంపిణీ చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి.. ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని సేకరించినట్లు వెల్లడించారు.

housing plots distribution in nadendla, ganapavaram
నాదెండ్ల, గణపవరంలో ఇళ్ల పట్టాలు పంచుతున్న ఎమ్మెల్యే రజిని

By

Published : Jan 3, 2021, 9:35 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండల కేంద్రంతో పాటు గణపవరంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీకి.. ఎమ్మెల్యే విడదల రజిని హాజరయ్యారు. రెండు గ్రామాల్లోని 1,466 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందజేశారు. నాదెండ్లలో సుమారు రూ. 3 కోట్లు , గ‌ణ‌వ‌రంలో రూ.13 కోట్లు వెచ్చించి ప్ర‌భుత్వ, ప్రైవేటు భూమిని సేక‌రించి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

పేదల సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు సీఎం జగన్ మ‌హా య‌జ్ఞాన్ని త‌ల‌పెట్టారని.. పేద‌లందరికీ ఒకేసారి ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చిత్త‌శుద్ధితో ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. దేశ చ‌రిత్ర‌లోనే ఈ స్థాయిలో ఇళ్ల నిర్మాణం ఎక్క‌డా, ఎప్పుడూ జరగలేదన్నారు. ప‌ట్టాలు ఇవ్వడమే కాక నాణ్య‌మైన గృహాలనూ ప్ర‌భుత్వమే నిర్మించి ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details