ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పట్టాలు రాకపోతే నిరుత్సహ పడొద్దు... దరఖాస్తు చేసుకుంటే ఇస్తాం'

రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సొంత ఇల్లు లేని పేదలందరికీ ఇళ్లు కల్పించటమే ముఖ్యమంత్రి లక్ష్యమని వైకాపా నేతలు అన్నారు. కొన్ని ప్రాంతాల్లో అర్హులకు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్న వేళ... దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ ఇస్తామని సర్ది చెబుతున్నారు.

house sites distribution
ఇళ్ల పట్టాల పంపిణీ

By

Published : Dec 30, 2020, 12:21 PM IST

విజయనగరం జిల్లాలో..

విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నాలుగో రోజు ఇళ్ల పట్టాల పంపిణీ ఘనంగా జరింగి. ఎన్నికల ముందు అక్కాచెల్లిల్లకు ఇచ్చిన హామీని, ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చుతున్నారని ఎమ్మెల్యే రాజన్న దొర అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తు ప్రజలు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పట్టాలను అర్హులైన వారికి అందజేశారు. ప్రతిపక్షాలు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలనే ఆలోచనలు చేస్తున్నాయంటూ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు.

గుంటూరు జిల్లాలో..

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో నాలుగో రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిరంగిపురం మండలం మెరిగపూడి, మునగపాడు, గుండాలపాడు, యర్రగుంట్లపాడు గ్రామాల్లో అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీదేవీ మాట్లాడుతూ, పేదల కళ్లల్లో ఆనందమే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రాత్మకం అని అన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు, కేతకముక్కల అగ్రహారం గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా.. అర్హులైన పేదవారికి పట్టాలు పంపిణీ చేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, సీఎం జగన్ 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను పంపణీ చేస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులై ఉండీ.. పట్టాలు రాకపోతే నిరుత్సాహ పడవద్దనీ.. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, 90 రోజుల్లో పట్టా అందిస్తామని హామీ ఇచ్చారు.

కర్నూలులో ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డగింత

అర్హులైన తమకు ఇళ్లపట్టాలు ఇవ్వలేదని... కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవనూరు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రహదారిపై బైఠాయించి... నిరసనతెలిపారు.
పట్టాల పంపిణీకి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. రెండో విడతలో మిగిలిన వారికి పట్టాలు ఇస్తామని అధికారులు సర్దిచెప్పటంతో స్థానికులు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:ప్రకాశం జిల్లా వాసులకు శుభవార్త... కీలక ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details