సీఎం జగన్ నివాస సమీపంలోని బకింగ్‌హామ్ కాలువ పక్కనే ఉంటున్న అమరారెడ్డినగర్ వాసులకు.. మంగళగిరి మండలం ఆత్మకూరు వద్ద కేటాయించే ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లబ్ధిదారులకు పట్టాలందించారు. జగనన్న కాలనీలో బోర్లు, ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అభివృద్ధి, సీఎం భద్రత దృష్ట్యా మాత్రమే అమరారెడ్డినగర్ వాసులను ఆత్మకూరుకు తరలిస్తున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు.
అమరారెడ్డినగర్ వాసులకు ఇళ్ల పట్టాల పంపిణీ - amamrareddynagar house deeds distribution news
ముఖ్యమంత్రి జగన్ నివాస సమీపంలో ఉంటున్న అమరారెడ్డినగర్ వాసులకు కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఆత్మకూరు వద్ద కేటాయించిన ఇళ్లస్థలాల పట్టాలు అందించిన కలెక్టర్, ఎమ్మెల్యే.. జగనన్న కాలనీలో బోర్లు, ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
house pattas distribution to amarareddy nagar in guntur district