ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెరువులు తలపిస్తున్న ఇళ్ల స్థలాలు! - flood in house layouts news

పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి భూములు కొని, లే అవుట్లు వేశారు అధికారులు. అంతా బాగానే ఉన్నా... ఇటీవల కురిసిన వర్షాలకు ఆ లేఅవుట్లలలో నీరు చేరి, చెరువులను తలపిస్తున్నాయి. ఆ స్థలాలకు వెళ్లి చూస్తే కానీ అర్థం కావటం లేదు... అవి పేదలకు పంచేందుకు ఎంపిక చేసిన స్థలాలు అని!

flood water in house sites
చెరువులు తలపిస్తున్న ఇళ్ల స్థలాలు

By

Published : Dec 23, 2020, 9:49 AM IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని, పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయటానికి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసి, విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కోట్లు ఖర్చు పెట్టి మరీ భూములు కొని లేఅవుట్లు వేశారు. లోతట్టు ప్రాంతాల లేఅవుట్లలలో మెరకలు వేయటానికి కోట్ల రూపాయల వ్యయం చేశారు. కానీ... గుంటూరు పురపాలక సంఘం పరిధిలో ఉన్న పేదవారికి ఇచ్చే లేఅవుట్లలో పూర్తి స్థాయిలో మెరకలు వేయలేదు. ఫలితంగా ఇటీవల కురిసిన వర్షాలకు ఆ స్థలాలన్నీ చెరువులను తలపించేలా.. ఇప్పటికీ నిండుగా నీటితో కనిపిస్తున్నాయి.

పురపాలక సంఘం పరిధిలో 3,474 మంది పేదలకు ఈ నెల 25న సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం మూలపాలెం రోడ్డు, విద్యానగర్, గంగపుత్రరాలనీ సమీపంలో 101.52 ఎకరాల భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసి... లే అవుట్లు వేశారు. ఈ ప్రాంతంలో మెరకలు పూర్తి స్థాయిలో వేయకపోవటంతో... ఇటీవల కురిసిన వర్షాలకు నీరు భారీగా నిలిచి బురదమయంగా మారింది. అధికారులు వేయించిన అంతర్గత గ్రావెల్ రోడ్లు సైతం దెబ్బతిన్నాయి.

ABOUT THE AUTHOR

...view details