లాక్డౌన్ ప్రభావం గుర్రాలపైనా పడింది. కరోనా దృష్ట్యా శుభకార్యాలు, ఊరేగింపులు అన్నీ ఆగిపోవటంతో గుర్రాలను పెంచుకునే వారికి ఉపాధి లభించటం లేదు. గుంటూరులో గుర్రాలను ఊరేగింపులకు అద్దెకిచ్చేవారు. ఇపుడు గిరాకీ లేక... వాటిని మేపలేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పచ్చగడ్డి తీసుకురాలేక కేవలం శనగపొట్టునే వాటికి దాణాగా అందిస్తున్నారు. దీంతో గుర్రాలు బక్కచిక్కిపోయి నీరసంగా కనిపిస్తున్నాయి. లాక్డౌన్ ముగిశాక కూడా శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారన్న ఆశ లేకపోవటంతో గుర్రాల యజమానుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
లాక్డౌన్ ప్రభావం... అశ్వాలకు అందని పోషకాహారం - ఏపీ లాక్డౌన్ వార్తలు
లాక్డౌన్ పేదలతో పాటు మూగజీవాలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. శుభకార్యాలన్నీ ఆగిపోవటంతో గుర్రాలను మేపలేకపోతున్నారు వాటి యజమానులు. పచ్చగడ్డి లభించక శనగపొట్టుతోనే వాటి కడుపునింపుతున్నారు.

horse owners facing problems due to lockdown
లాక్డౌన్ ప్రభావం... అశ్వాలకు అందని పోషకాహారం