పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ గోడ కూలి వ్యక్తి మరణించిన ఘటన.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలో జరిగింది. దుగ్గిరాల మండలం పెదకొండూరుకు చెందిన కలపాల మరియదాసు అనే వ్యక్తి.. వల్లభాపురానికి చెందిన కృష్ణారెడ్డి ఇంట్లో కూలీ పని చేసేవాడు.
రోజూ మాదిరిగానే.. పని చేస్తున్న సమయంలో.. ఇంటికి మరమ్మతులు చేశారు. ప్రమాదవశాత్తూ గోడ కూలి మరియదాసుపై పడింది. తీవ్ర గాయాలపాలైన అతను మరణించాడు. పోస్ట్ మార్టం నిమిత్తం తెనాలిలోని జిల్లా ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని ఎస్సై బలరామరెడ్డి వెల్లడించారు.