గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో నిర్మించిన సెయింట్ లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవంలో హోంమంత్రి మేకతోటి సుచరిత చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినితో కలిసి పాల్గొన్నారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కొండవీడులో లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవం - గుంటూరు జిల్లా వార్తలు
గుంటూరు జిల్లా కొండవీడు గ్రామంలో నిర్మించిన సెయింట్ లూథరన్ చర్చి ప్రతిష్ట మహోత్సవంలో హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే విడుదల రజిని, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధుల పేరిట పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు కృప అందరిపై ఉండాలని, దేవుని దయతో రాష్ట్రం సుపరిపాలన, పాడిపంటలతో సుభిక్షంగా ఉందన్నారు. కొండవీడు గ్రామస్థులు విరాళాలలో చర్చి నిర్మించుకోవటం హర్షణీయం అన్నారు. చంగిస్ ఖాన్ పేట గ్రామస్థులు పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలు రైతులు అందడంలేదన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఎంపీ కృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :రాష్ట్రంలోని రాజ్యాంగ వైఫల్యాలపై రాష్ట్రపతికి లేఖ: ఎంపీ రఘురామ