ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం: హోంమంత్రి - స్వరూపానంద స్వామి జన్మదిన వేడుకల్లో హోంత్రి సుచరిత న్యూస్

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యానించారు. గుంటూరు అంధుల పాఠశాలలో నిర్వహిచిన స్వామిజీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి కేక్ కట్ చేసి.. విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.

స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం: హోంమంత్రి
స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం: హోంమంత్రి

By

Published : Nov 17, 2020, 3:03 PM IST

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరు అంధుల పాఠశాలలో నిర్వహించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదిన వేడుకల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ముందుగా ఓంకార క్షేత్రం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేశారు.

విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. స్వామిజీ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని హోంమంత్రి వ్యాఖ్యానించారు. సకాలంలో వర్షాలు, పంటలు పండుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details