ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మున్సిపల్ ఎన్నికల్లోనూ వైకాపాకు అత్యధిక మెజారిటీ వస్తుంది' - విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మంత్రి సుచరిత న్యూస్

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వైకాపా మద్దతుదారులు ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా స్థానిక ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు.

Home_minister_winning_rally_at pedhanandhipadu mandal in guntur district
'రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ వైకాపాకు అత్యధిక మెజారిటీ వస్తుంది'

By

Published : Feb 26, 2021, 2:31 AM IST

గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు. దీనంతటికీ కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు గెలుపొందిన సందర్భంగా.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులో చేపట్టిన విజయోత్సవ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నపర్రు సర్పంచ్ వసుమతి రమాదేవి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, వార్డు మెంబర్లను అభినందించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ.. వైకాపాకు అత్యధిక మెజారిటీ వస్తుందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

కోటప్పకొండ ప్రభల నిర్మాణాన్ని ఆపే ప్రసక్తే లేదు: పత్తిపాటి పుల్లారావు

ABOUT THE AUTHOR

...view details