ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Home minister: వచ్చే వేసవిలో గుంటూరు ఛానల్ పొడిగింపు పనులు: సుచరిత

గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ.. పెదనందిపాడు నుంచి నాగులపాడు వరకు రైతులు పాదయాత్ర చేశారు. అటుగా వెళ్తున్న హోంమంత్రి సుచరిత.. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకున్నారు. ఛానల్ పొడిగింపునకు.. పొలాల సేకరణ చేయాలని హోంమంత్రికి రైతులు విజ్ఞప్తి చేయగా.. త్వరలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సుచరిత హామీ ఇచ్చారు.

By

Published : Oct 9, 2021, 3:22 PM IST

home minister sucheritha
రైతులతో మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు నుంచి.. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ రైతులు పాదయాత్ర చేశారు. అటుగా ఓ కార్యక్రమానికి వెళ్తున్నహోంమంత్రి సుచరిత.. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఛానల్ పొడిగింపునకు.. పొలాల సేకరణ చేయాలని రైతులు హోంమంత్రికి విజ్ఞప్తి చేయగా.. దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఛానల్ ఆధునికీకరణ, పొడిగింపు రెండు కలిపి జరిగితేనే ఉపయోగమని, తాము ఇచ్చిన హామీ గుర్తుందని సుచరిత అన్నారు. ఛానల్ పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. వచ్చే వేసవిలో పనులు ప్రారంభిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details