గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను.. హోంమంత్రి మేకతోటి సుచరిత పంపిణీ చేశారు. గుంటూరు బ్రాడిపేటలోని క్యాంప్ కార్యాలయంలో.. లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 132 మందికి రూ. 94 లక్షల 87 వేలు రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
గుంటూరు రూరల్ మండలానికి.. రూ.50,16,000, ప్రత్తిపాడు మండలానికి రూ.15,55,000, పెదనందిపాడు మండలానికి రూ.10,47,000, కాకుమాను మండలానికి రూ.9,83,000, వట్టిచెరుకూరు మండలానికి రూ.8,86,000 రూపాయలు మంజూరు అయ్యాయి.