వైకాపా ప్రభుత్వం... అన్నిరంగాల్లో మహిళలకే ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మహిళల స్వావలంభన దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను హర్షిస్తూ... గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురంలో వైకాపా నాయకురాలు రోజారాణి ఆధ్వర్యంలో చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీని సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా సుచరితను మహిళలు సన్మానించారు. బీసీ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం కోటాను ప్రభుత్వం అతివలకే కట్టబెట్టిందన్నారు. త్వరలో ఇవ్వబోయే 30 లక్షల ఇళ్లస్థల పట్టాలను మహిళల పేరునే ఇస్తున్నామని హోంమంత్రి చెప్పారు.
అన్ని రంగాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యం: హోంమంత్రి సుచరిత - వైకాపా మహిళలకే అన్న రంగాల్లో అధిక ప్రాధాన్యమిస్తోందన్న సుచరిత
వైకాపా ప్రభుత్వం మహిళలకే అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యమిస్తోందని... హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లాలోని లక్ష్మీపురంలో వైకాపా నాయకురాలు రోజారాణి ఆధ్వర్యంలో చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీని సుచరిత ప్రారంభించారు.
అన్ని రంగాల్లో మహిళలకే అధిక ప్రాధాన్యం: హోంమంత్రి సుచరిత