ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమర జవాన్ మురళీకృష్ణ కుటుంబానికి హోం మంత్రి పరామర్శ - గుంటూరు జిల్లా వార్తలు

బిజాపూర్ ఎదురుకాల్పుల ఘటనలో మృతి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన జవాను మురళీకృష్ణ కుటుంబాన్నిహోం మంత్రి సుచరిత పరామర్శించారు. వారికి ప్రభుత్వం తరఫున ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

home minister sucharitha visited jawan muralikrishna family
అమర జవాన్ మురళీకృష్ణ కుటుంబానికి హోం మంత్రి సుచరిత పరామర్శ

By

Published : Apr 7, 2021, 10:41 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్పీఎఫ్ అమర జవాన్ మురళీకృష్ణ కుటుంబ సభ్యులను హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సీఆర్పీఎఫ్ జవాన్ శాఖమూరి మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హోంమంత్రితో పాటు సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జవాన్ కుటుంబీకులను కలిశారు.

అమర జవాన్ కుటుంబ సభ్యులు ఆమెకు.. తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటామని సుచరిత హామీ ఇస్తూ భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 35 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని నేతలు వారికి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details