లాక్‌డౌన్ ఉన్నా చాలామంది రోడ్లపైకి వస్తున్నారని హోంమంత్రి సుచరిత ఆందోళన వ్యక్తం చేశారు. మనదేశంలో జనసాంద్రత ఎక్కువ, అందుకే మరింత ప్రమాదమని హెచ్చరించారు. నిత్యావసర సరకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిషేధం విధించినట్టు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన 11,800 మందిపై ప్రత్యేక నిఘా ఉంచామని సుచరిత వివరించారు. మాస్కులు, శానిటైజర్ల కోసం ఆందోళన అవసరం లేదన్న హోంమంత్రి... పరిస్థితి, అవసరం మేరకు కేంద్రబలగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
'జనసాంద్రత ఎక్కువ... అందుకే మరింత ప్రమాదం'
నిత్యావసర సరకుల ధర పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత హెచ్చరించారు. లాక్‌డౌన్ ఉన్నా చాలామంది రోడ్లపైకి వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన 11,800 మందిపై ప్రత్యేక నిఘా ఉంచామని హోంమంత్రి స్పష్టం చేశారు.
హోంమంత్రి సుచరిత