ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా సంరక్షణ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ: హోంమంత్రి - guntur district latest news

మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మార్చినందున వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మహిళల భద్రత కోసం వీరి సేవల్ని ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. దిశ యాప్​పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీరంతా ముందుండాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

home minister sucharitha
హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

By

Published : Jun 26, 2021, 4:08 PM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా మార్చినందున వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు.

గ్రామ, వార్డు స్థాయిలో మహిళా కార్యదర్శులు 11వేల 500 మందికి పైగా ఉన్నారన్నారు. అందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి విడతల వారీగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. మహిళల భద్రత కోసం వీరి సేవల్ని ఉపయోగించుకుంటామన్నారు. దిశ యాప్​పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీరంతా ముందుండాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించటంలో సచివాలయ సిబ్బంది మెరుగ్గా పని చేయాలని ఆదేశించారు. అనంతరం పశువైద్యశాలను ప్రారంభించారు. అక్కడ మందులు, ఇతర పరికరాల లభ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details