ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనుమతి తీసుకోకపోవడం వల్లే గృహనిర్బంధం: హోం మంత్రి సుచరిత - కొండపల్లి మైనింగ్‌ తాజా వార్తలు

తెలుగుదేశం నేతలు ముందస్తు అనుమతి తీసుకోకపోవడం వల్లే పోలీసులు గృహనిర్భంధించారని హోంమంత్రి సుచరిత తెలిపారు. కొండపల్లి మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించడానికి.. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు అడ్డుకుంటున్నారని స్పష్టం చేశారు.

హోం మంత్రి సుచరిత
హోం మంత్రి సుచరిత

By

Published : Jul 31, 2021, 2:48 PM IST

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు అడ్డుకుంటున్నారు: హోం మంత్రి సుచరిత

కొండపల్లి మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించడానికి తెలుగుదేశం నేతలు ముందస్తు అనుమతి తీసుకోకపోవడం వల్లే పోలీసులు గృహనిర్భంధం చేశారని హోంమంత్రి సుచరిత అన్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టారనడంలో వాస్తవం లేదన్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం తప్పుడు కేసులు అని తేలితే ఎలాంటి శిక్షలు ఉండవన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details