ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 16, 2021, 9:21 PM IST

ETV Bharat / state

విద్యకు ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం జగన్​కే దక్కుతుంది: హోం మంత్రి సుచరిత

గుంటూరు జిల్లా పొన్నూరులో నిడుబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'మనబడి నాడు- నేడు' రెండో విడత కార్యక్రమాన్ని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. దేశంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు.

హోం మంత్రి సుచరిత
హోం మంత్రి సుచరిత

దేశంలో విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. మనబడి నాడు- నేడు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. తొలి విడతలో రూ. 26 కోట్లుతో అనేక పాఠశాలల రూపురేఖలు మార్చినట్లు తెలిపారు.

విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇచ్చే రాష్ట్రాలు మాత్రమే మానవ అభివృద్ధి సూచిక జాబితాలో ఉంటాయని మాజీ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీల పరంగా విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. మనబడి నాడు-నేడు కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. అనంతరం విద్యార్థులకు జగనన్న కానుక కిట్టు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జేసీ ప్రశాంతి, జిల్లా విద్యాశాఖ అధికారి గంగాభవానీ పాల్గొన్నారు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి..

యువత, విద్యార్థులు... సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. గుంటూరులో జరిగిన యువతి దారుణ హత్య చాలా బాధాకరమన్నారు. ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ 10 లక్షల అందించినట్లు తెలిపారు. దిశా యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటుతో రాష్ట్రంలో మహిళలకు రక్షణ అత్యంత చేరువలో ఉందన్నారు. ప్రతిపక్షాలు దీనిపై రాద్ధాంతాలు చేయడం మాని అమలుపై ప్రభుత్వానికి పలు సూచనలు సలహాలు చేస్తే బాగుంటుందన్నారు.

ఇదీచదవండి..

డ్యాంల పరిరక్షణకు 315 మంది నియామకానికి కసరత్తు: మంత్రి అనిల్ కుమార్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details