ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం' - Home Minister Sucharitha latest news

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పోటీపడాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని హోం మంత్రి ప్రారంభించారు.

Home Minister Sucharitha Launch Jagananna Vidya deevena in Prattipadu
సుచరిత

By

Published : Oct 8, 2020, 5:51 PM IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్​తో కలసి హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ఆంగ్ల మాధ్యమం బోధనతో పాటు నాడు-నేడు కింద పాఠశాలలు అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చారని చెప్పారు.

అక్షరాస్యతలో దేశ సగటు కన్నా.. రాష్ట్ర సగటు తక్కువగా ఉందని... అందుకే సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని వివరించారు. రూ.261 కోట్లతో 1100 పాఠశాలలను తొలి విడతగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విద్యాకానుక ఇచ్చేందుకు రూ.650 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయపడే వారని... ఇప్పుడు మహిళల రక్షణ కోసం దిశ లాంటి బలమైన చట్టాలు తీసుకువచ్చామన్నారు. ఆడపిల్లలను పాఠశాలకు పంపాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ప్రపంచంతో పోటీపడేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం: సీఎం

ABOUT THE AUTHOR

...view details