గత ప్రభుత్వాలు ఎక్కడా ఒక్క సెంటు భూమి ఇవ్వకపోగా... తమ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులలో కేసులు వేసి మోకాలడ్డుతున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నూతన సచివాలయాలను ప్రారంభించిని హోంమంత్రి... వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని 5 కోట్ల రూపాయల రుణమాఫీ చెక్కును అందజేశారు.
'ఇళ్ల స్థలాలు ఇస్తామంటే.. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి'
పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడుతున్నాయని హోంమంత్రి సుచరిత విమర్శించారు. ముఖ్యమంత్రిగా జగన్ ఇంకో 30 ఏళ్లు ఉంటే.. మహిళలు కోటీశ్వరులు అవుతారని పేర్కొన్నాారు.
30 లక్షల మందికి తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు ఇస్తామని.. ఇప్పటికే అన్ని సిద్ధమయ్యాయని చెప్పారు. కోర్టులో కేసులు తొలగిన వెంటనే మహిళలకు పట్టాలు అందిస్తామన్నారు. తొలి విడతగా డ్వాక్రా రుణమాఫీ కింద రూ.6 వేల కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రూ.65 వేల కోట్లు ప్రజల ఖాతాలలో నగదు జమ చేసినట్లు వెల్లడించారు. ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు నగదు జమ చేస్తున్నామని... జగన్ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే మహిళలు కోటీశ్వరులు అవుతారని పేర్కొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రూ.70 కోట్లతో రహదారులు నిర్మించనున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండీ...ఆ బెంజ్ కారు.. మంత్రి ఇంట్లోనే ఉంది: అయ్యన్నపాత్రుడు