Home Minister Sucharitha Fire On Agriculture Officers: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల సర్వసభ్య సమావేశంలో హోమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ప్రత్తిపాడులో మిర్చికి ఈ-క్రాప్ చేయించలేదని ఈ సందర్భంగా రైతులు హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన హోమంత్రి.. ఈ-క్రాప్ ఎందుకు చేయలేదని ఉద్యాన అధికారులను వివరణ అడిగారు.
ఈ-క్రాప్ వివరాల డేటా తయారు చేశారా? అని ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో అధికారులపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ-క్రాప్ చేయకపోతే రైతులకు ఎవరు డబ్బులు ఇస్తారని అధికారులను ప్రశ్నించారు.