ప్రస్తుతం ఇళ్ల పట్టాలు పొందలేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే.. మూడు నెలల్లో వారికి ఇంటి స్థలం మంజూరు చేస్తామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొన్న ఆమె నగరంతో పాటు మండలంలోని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఆడ బిడ్డలందరికీ సొంత ఆస్థి ఉండాలనే ఉద్దేశంతో వారి పేరిట ఇళ్లస్థలాలు ఇస్తున్నట్లు తెలిపారు. కరోనా వంటి విపత్కర సమయంలోనూ సంక్షేమం విషయంలో రాజీపడకుండా అమలు చేస్తున్నట్లు పేర్కొన్న ఆమె ఇది సంక్షేమనామ సంవత్సరంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు.
'ఆడ బిడ్డలందరికీ సొంత ఆస్థి ఉండాలనే ఇళ్ల స్థలాలు పంపిణీ' - తాడికొండలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన హోం మంత్రి సుచరిత వార్తలు
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో హోం మంత్రి సుచరిత పాల్గొన్నారు. నగరంతోపాటు తాడికొండ మండల పరిధిలోని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఇళ్ల పట్టాలు పొందలేని వారు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లో ఇంటి స్థలం మంజూరు చేస్తామని హోం మంత్రి పేర్కొన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీలో హోం మంత్రి సుచరిత