రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను హోం మంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ నేతలకు లేదన్నారు. వైకాపా ప్రభుత్వం అంబేడ్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా.. బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల అవకాశాలు కల్పిస్తునట్లు చెప్పారు. మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని హితవు పలికారు. గుంటూరు నల్లచెరువులో ఇళ్ల పట్టాల పంపిణీలో పాల్గొని.. అర్హులకు పట్టాలు అందజేశారు.
రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత తెదేపాకు లేదు: హోంమంత్రి - నారా లోక్‌శ్‌పై హోంమంత్రి సుచరిత ఆగ్రహం
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం ఆమలవుతుందని తెదేపా నేత నారా లోకేశ్ వ్యాఖలపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత తెదేపా నేతలకు లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
![రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత తెదేపాకు లేదు: హోంమంత్రి home minister sucharitha comments on nara lokesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10423037-995-10423037-1611916619728.jpg)
home minister sucharitha comments on nara lokesh
తెదేపా నేత నారా లోకేశ్‌పై హోంమంత్రి వ్యాఖ్యలు