రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. బ్రాడిపేటలోని తన నివాసంలో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అంబేడ్కర్ ఎంతో మందికి ఆదర్శమని హోంమంత్రి కొనియాడారు. జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోందని..ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
'కరోనా నివారణకు ప్రజల సహకారం అవసరం' - హోం మంత్రి సుచరిత తాజా వార్తలు
కరోనా లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలని హోం మంత్రి సుచరిత సూచించారు. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తి కట్టడికి ప్రజల సహకారం కావాలన్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఆమె గుంటూరు జిల్లా బ్రాడిపేటలోని నివాసంలో జరుపుకున్నారు.
!['కరోనా నివారణకు ప్రజల సహకారం అవసరం' home minister sucharitha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6789112-500-6789112-1586862950699.jpg)
'అంబేడ్కర్ జయంతిని ఇంట్లోనే జరుపుకోండి'