అతివల భద్రతకు మహిళా మిత్ర తెచ్చామని హోంమంత్రి సుచరిత చెప్పారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన మహిళా మిత్ర కార్యక్రమానికి హోంమంత్రి శ్రీకారం చుట్టారు. మహిళలు, బాలికలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సదస్సులో రక్షణపై మహిళల్లో చైతన్యం, పోలీసుల సాయం పొందడంపై గుంటూరు గ్రామీణ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
మహిళలకు అండగా నిలుస్తాం: హోంమంత్రి సుచరిత - హోంమంత్రి సుచరిత న్యూస్
దిశ వంటి ఘటనలు రాష్ట్రంలో జరగకుండా గట్టి చర్యలు చేపడతామని... మహిళలు, బాలికలకు అండగా నిలుస్తామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత భరోసా ఇచ్చారు. మహిళలు, బాలికలు ఆపద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని... పోలీసు శాఖ అండగా ఉంటుందని హామీఇచ్చారు.
మహిళలకు అండగా నిలుస్తాం:సుచరిత
మంత్రులు శ్రీరంగనాథరాజు, మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యేలు విడదల రజనీ, అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా ఎస్పీ విజయరావు పాల్గొన్నారు. మహిళా భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని... మహిళా సాధికారిత దిశగా మంత్రివర్గ కూర్పులోనూ పెద్దపీట వేసిన విషయాన్ని సుచరిత గుర్తుచేశారు.
ఇదీ చదవండి: ఎవరైనా ఇబ్బంది పెడితే.. కాల్ చేయండి!