ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన హోంమంత్రి సుచరిత - గుంటూరు రోడ్డు ప్రమాదంపై హోమంత్రి సుచరిత కామెంట్స్

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపరం వద్ద రోడ్డు ప్రమాదానికి గురై జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు.

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన హోమంత్రి సుచరిత
రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన హోమంత్రి సుచరిత

By

Published : Feb 14, 2021, 8:30 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపరం వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందటం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతురాలి వివరాలు సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఏం జరిగిందంటే..

కోర్నేపాడుకు చెందిన గ్రామస్థులు ప్రార్థన కోసం మేరీమాత మందిరానికి ఆటోలో బయల్దేరారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా..ముగ్గురు చిన్నారులు సహా 10 మందికి గాయాలయ్యాయి.

ఇదీచదవండి

ఆటోను ఢీకొట్టిన బస్సు.. మహిళ మృతి, 10మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details