రాష్ట్రంలోని జైళ్లలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హోంమంత్రి సుచరిత తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కారాగారాల్లో 147 మంది మహిళా ఖైదీలు జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి తెలిపారు. వీరిలో 55 మంది ఖైదీలకు విడుదల అయ్యేందుకు అర్హత ఉందన్నారు. అర్హత ఉన్న ఖైదీల వివరాలు సేకరించి వారి రికార్డులను ఆరుగురు సభ్యుల కమిటీ పరిశీలిస్తుందన్నారు.
మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం నిర్ణయం : హోంమంత్రి - జీవిత ఖైదు మహిళా ఖైదీలు విడుదలపై మంత్రి సుచరిత కామెంట్స్
రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలను నిబంధనల ప్రకారం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హోంమంత్రి సుచరిత చెప్పారు. జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీల్లో 55 మంది విడుదల అయ్యేందుకు అర్హత ఉందని ఆమె తెలిపారు. ఖైదీల విడుదలను ఆరుగురు సభ్యుల కమిటీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
కమిటీ నిర్ణయం అనంతరం ఎంతమందిని విడుదల చేసేది తెలుపుతామని హోంమంత్రి తెలిపారు. కమిటీలో హోంశాఖ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్గా .. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ, సీఐడీ న్యాయసలహాదారు, జైళ్ల శాఖ డీజీ, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని చెప్పారు. మహిళా ఖైదీల విడుదలకు సంబంధించిన నియమావళిని ప్రభుత్వం జారీ చేసిందని హోంమంత్రి తెలిపారు. కమిటీ నిర్ణయించిన మహిళా ఖైదీలను వారం రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఖైదీల ఎంపిక జరుగుతుందన్నారు .
ఇదీ చదవండి :సీఎం జగన్తో తైవాన్ సంస్థల ప్రతినిధులు భేటీ