Home Minister Sucharita on police jobs : గుంటూరు జిల్లా వినుకొండలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు. పోలీసు శాఖలో సిబ్బంది కొరత కారణంగా పడుతున్న ఇబ్బందులు వాస్తవమని.. త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో 14 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. త్వరలోనే వాటిని భర్తీ చేస్తామన్నారు.
నిరుద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు... త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలు - వినుకొండ వార్తలు
Home Minister Sucharita on police jobs : నిరుద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో 14 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. త్వరలోనే వాటిని భర్తీ చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
![నిరుద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు... త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలు Home Minister Sucharita](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14037014-693-14037014-1640732234509.jpg)
Home Minister Sucharita
నిరుద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు... త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలు
వినుకొండలో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని సుచరిత అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ హక్కు పథకం బృహత్తరమైనదని.. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటీఎస్ పథకంపై పక్షాలు చేస్తున్న విమర్శలు విడ్డూరమన్నారు. అలాగే నష్టపోయిన ప్రతి మిరప రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.
ఇదీ చదవండి
APPSC Job Notifications: రెవెన్యూ, దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Last Updated : Dec 29, 2021, 6:01 AM IST