ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Home Minister: ప్రజలు ఉన్న చోటే వైద్య సేవలు: హోంమంత్రి సుచరిత

ప్రజలు ఉన్న చోటే వైద్య సదుపాయాలు అందించేందుకు వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని హోమంత్రి సుచరిత అన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ.. ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

home minister sucharita on health developments in ap
ప్రజలు ఉన్న చోటే వైద్య సేవలు

By

Published : Jul 11, 2021, 3:07 PM IST

ప్రజలు ఉన్న చోటే వైద్య సేవలు

వైద్యం కోసం ప్రజలు ఎక్కడికో వెళ్లకుండా వారున్నచోటే సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా గోరింట్లలో ఆర్బన్ హెల్త్ సెంటర్‌ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తూ.. ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు.

మండలానికి రెండు పీహెచ్​సీలు, నియోజకవర్గ స్థాయిలో సామాజిక ఆస్పత్రులు, పట్టణాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కరోనా వ్యాప్తిని ప్రభుత్వం సమర్థవంతంగా నియంత్రించిందని.. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అనారోగ్య సమస్యనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో మేయర్ కావటి నాగమనోహర్ నాయుడు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details