గుంటూరు నగరపాలక సంస్థలో విలీనమైన పంచాయతీల్లో.. తొలిసారిగా పుర ఎన్నికలు జరుగుతున్నాయి. పలకలూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత.. గురువారం సాయంత్రం అభ్యర్థులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలను నేరవేర్చి.. పేదల కళ్లలో ఆనందం తీసుకొచ్చామన్నారు. అటువంటి పాలనను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపునకు అందరూ సహకరించాలని కోరారు.
పలకలూరులో హోంమంత్రి సుచరిత ఎన్నికల ప్రచారం - పలకలూరులో ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి సుచరిత
పురపాలక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ.. పలువురు ప్రజాప్రతినిధులు జనంలోకి వెళుతున్నారు. గుంటూరు రూరల్ మండలం పలకలూరులో హోం మంత్రి సుచరిత ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
![పలకలూరులో హోంమంత్రి సుచరిత ఎన్నికల ప్రచారం home minister sucharita in palakaluru election campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10875198-573-10875198-1614889262936.jpg)
గుంటూరు రూరల్ మండలంలో రాష్ట్ర హోంమంత్రి సుచరిత ప్రచారం