ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Drugs Mafia: 'గుజరాత్‌లో డ్రగ్స్ దొరికాయని.. ప్రధాని మోదీకి లింకు పెడతారా?' - హోమంత్రి సుచరిత న్యూస్

డ్రగ్స్‌ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌పై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు సరికావని హోంమంత్రి సుచరిత అన్నారు. విజయవాడ అడ్రస్‌ ఉందని ముఖ్యమంత్రిని నిందిస్తున్న ప్రతిపక్షం..గుజరాత్‌లో దొరికాయని ప్రధానమంత్రి మోదీకి లింకు పెడతారా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో డ్రగ్స్ దొరికాయని ప్రధాని మోదీకి లింకు పెడతారా ?
గుజరాత్‌లో డ్రగ్స్ దొరికాయని ప్రధాని మోదీకి లింకు పెడతారా ?

By

Published : Oct 7, 2021, 6:03 PM IST

రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ వ్యవహారంలో సీఎం జగన్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరైనవి కాదన్నారు. డ్రగ్స్‌ దిగుమతి అడ్రస్‌ విజయవాడ పేరిట ఉందని సీఎంను నిందించడం దారుణమన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, వాడకంపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు.

తాలిబన్లతో రాష్ట్రానికి సంబంధం అంటగడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని సుచరిత కొట్టిపారేశారు. గుజరాత్‌లో డ్రగ్స్ దొరికాయని ప్రధాని మోదీకి లింక్​ పెడతారా ? అని ప్రశ్నించారు. దేశంలో డ్రగ్స్ రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు రావడం అందరి వైఫల్యంగా భావించాలని అభిప్రాయపడ్డారు. మాదకద్రవ్యాల నిరోధక, నియంత్రణ బాధ్యత ప్రజలందరిపైనా ఉందని సుచరిత పేర్కొన్నారు.

గుజరాత్‌లో డ్రగ్స్ దొరికాయని ప్రధాని మోదీకి లింకు పెడతారా ?

డ్రగ్స్‌ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్‌పై ప్రతిపక్షం ఆరోపణలు చేయడం సరికావు. విజయవాడ అడ్రస్‌ ఉందని ముఖ్యమంత్రిని నిందిస్తున్న ప్రతిపక్షం..గుజరాత్‌లో దొరికాయని ప్రధానమంత్రి మోదీకి లింకు పెడతుందా?. గంజాయి, మాదకద్రవ్యాల విక్రయం, వాడకంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాలిబన్లతో రాష్ట్రానికి సంబంధం అంటగడుతూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితం. దేశంలోకి డ్రగ్స్ రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - సుచరిత, హోంమంత్రి

ఇదీ చదవండి

డ్రగ్స్ అంశంలో నాపై వస్తున్న ఆరోణలపై విచారణ చేపట్టాలి: అలీషా

ABOUT THE AUTHOR

...view details