ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Home Minister: వచ్చే ఎన్నికల్లో ఆయన ఎన్నిచోట్ల పోటీచేస్తారో చూడాలి: సుచరిత - పవన్ తాజా సమాచారం

పవన్ కల్యాణ్ మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందని హోమంత్రి సుచరిత అన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్..వచ్చే ఎన్నికల్లో ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తారో చూడాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఆయన ఎన్నిచోట్ల పోటీచేస్తారో చూడాలి
వచ్చే ఎన్నికల్లో ఆయన ఎన్నిచోట్ల పోటీచేస్తారో చూడాలి

By

Published : Sep 30, 2021, 3:27 PM IST

జనసేన అధినేత పవన్​పై హోంమంత్రి సుచరిత మండిపడ్డారు. ఆయన మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. ఏం మాట్లాడుతున్నారో పవన్ ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని హితవు పలికారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎక్కడుంటారో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండుస్థానాల్లో పోటీ చేస్తే..ప్రజలు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎన్నిచోట్ల పోటీ చేస్తారో చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details