గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆధ్వర్యంలో తాడికొండ గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరై భారీ కేక్ కోశారు. ప్రతీ ఒక్కరూ... జాలి, దయ, కరుణ కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 25వ తేదీ నాడు క్రిస్మస్తో పాటు వైకుంఠ ఏకాదశి కలిసివస్తున్న రోజున సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్ తాడికొండ, మెడికొండూరు, తుళ్లూరు, ఫిరంగిపురం మండల అధ్యక్షులు, ఎస్సీ సెల్ అధ్యక్షులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.
అమరావతి దీక్షా శిబిరాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు