ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పట్టణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని సూచించారు. కాల్వలకు మరమ్మతులు చేసి ఆయకట్టు భూములకు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సకాలంలో విత్తనాలు సరఫరా చేయాలి: హోంమంత్రి - Mekathoti Sucharitha
రైతులకు ఇబ్బంది కలగకుండా విత్తనాలు సపఫరా చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అధికారులను ఆదేశించారు. ప్రత్తిపాడు పట్టణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హోంమంత్రి మాట్లాడారు.
హోంమంత్రి మేకతోటి సుచరిత