ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారికి కరోనా సోకడం సమాజ శ్రేయస్సుకు ప్రమాదకరం' - హోమంత్రి సుచరిత తాజా వార్తలు

కరోనా మహమ్మారిపై పోరు సాగిస్తున్న కొందరు వైరస్ బారిన పడి మృతి చెందటం తనను కలచివేస్తోందని హోంమంత్రి సుచరిత వ్యాఖ్యనించారు. వైరస్ కారణంగా అనంతపురంలో మృతి చెందిన సీఐ రాజశేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

'వారికి కరోనా సోకడం సమాజ శ్రేయస్సుకు ప్రమాదకరం'
'వారికి కరోనా సోకడం సమాజ శ్రేయస్సుకు ప్రమాదకరం'

By

Published : Jul 16, 2020, 4:38 AM IST

అనంతపురం జిల్లాలో కరోనా కారణంగా సీఐ రాజశేఖర్ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని హోంమంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యనించారు. రాజశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతునన్నామని ట్వీటర్ వేదికగా స్పష్టం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్న పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పాత్రికేయులు వైరస్ బారిన పడుతుండటం బాధకరమన్నారు. ఇది సమాజ శ్రేయస్సుకు ప్రమాదకరమన్నారు. కరోనాపై పోరులో ముందు వరుసలో వీరు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరమన్నారు. దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్విట్​ చేశారు. ఇదీచదవండి

ABOUT THE AUTHOR

...view details