గుంటూరు జిల్లా పెదనందిపాడులో పాఠశాల నూతన భవనం, సచివాలయాలను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. విద్య ఉంటేనే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని...వంద శాతం అక్షరాస్యత సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకునేందుకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 26న విద్యార్థుల తల్లి ఖాతాలో అమ్మ ఒడి పథకం కింద 15 వేలు అందజేస్తారని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారుస్తామన్నారు. ఆంగ్ల మాధ్యమం ఏర్పాటుపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తున్నాయని...ఇది మంచిది కాదన్నారు. సమావేశం అనంతరం పలువురికి వైకాపా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
'ఆంగ్ల మాధ్యమంపై ప్రతిపక్షాలవి అనవసరపు అల్లర్లు' - పెదనందిపాడులో సచివాలయాల ప్రారంభ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించిందని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. పెదనందిపాడులో పాఠశాల నూతన భవనాన్ని, సచివాలయాలను ఆమె ప్రారంభించారు.
సచివాలయాన్ని ప్రారంభించిన హోంమంత్రి మేకతోటి సుచరిత